English | Telugu

అక్టోబ‌ర్ నుంచి `యానిమ‌ల్`

`అర్జున్ రెడ్డి` (2017)తో తెలుగునాట సెన్సేష‌న‌ల్ డెబ్యూ ఇచ్చారు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సందీప్ వంగా. క‌ట్ చేస్తే.. అదే సినిమాని `క‌బీర్ సింగ్` (2019) పేరుతో హిందీలో రీమేక్ చేసి అక్క‌డా అదే సెన్సేష‌న్ ని రిపీట్ చేశారు. దీంతో.. సందీప్ థ‌ర్డ్ వెంచ‌ర్ పై ఆస‌క్తి నెల‌కొంది. అందుకు త‌గ్గ‌ట్టే.. బాలీవుడ్ స్టార్ ర‌ణ్ బీర్ క‌పూర్ తో త‌న మూడో సినిమా చేస్తున్నారు సందీప్. `యానిమ‌ల్` పేరుతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌ణ్ బీర్ కి జంట‌గా ప‌రిణీతి చోప్రా న‌టిస్తుండ‌గా.. కీల‌క పాత్ర‌లో అనిల్ క‌పూర్, శ‌క్తిమంత‌మైన ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో బాబీ డియోల్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. విభిన్న‌మైన గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా `యానిమ‌ల్` తెర‌కెక్క‌నుంది.

ఇదిలా ఉంటే.. `యానిమ‌ల్`కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ని ఈ ఏడాది అక్టోబ‌ర్ లో ప్రారంభించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆపై చ‌క‌చ‌కా షూటింగ్ జ‌రిపి 2022 ద‌స‌రాకి సినిమాని విడుద‌ల చేయనున్నారు. ర‌ణ్ బీర్ పాత్ర‌, ఆయ‌న క‌నిపించే విధానం.. `యానిమ‌ల్`కి ప్ర‌ధాన బ‌లంగా నిలుస్తాయ‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, పున‌ర్జ‌న్మ‌ల చుట్టూ ఈ సినిమా క‌థ తిరుగుతుంద‌ని బ‌జ్. మ‌రి.. `యానిమ‌ల్`తో సందీప్ వంగా హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.